
చమత్కారంగా మాట్లాడేవారు..
డిసెంబర్ 2006లో జగపతిబాబు, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన ‘పెళ్లయిన కొత్తలో’ సినిమాకు నేను ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ఉన్నా. ఆ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారితో కలిసి ఫొటో దిగా. ఆయన చమత్కారంగా మాట్లాడేవారు. 1989లో వరంగల్‌కు వచ్చిన కోట శ్రీనివాసరావు తన తమ్ముడు కోట శంకర్‌రావుతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన వరంగల్ చౌరస్తాలోని ఊర్వశి హోటల్‌లో బస చేశారు. అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పుడే మొదటిసారి కోట శ్రీనివాసరావును ఊర్వశి హోటల్‌లో కలిశా.
– ఆహా శ్రీనివాస్, ఆర్టీసీ డ్రైవర్ వరంగల్ –1డిపో, హనుమకొండ