
అంతర్జాతీయ బ్లైండ్ గోల్‌బాల్ పోటీలకు సాయితేజ
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన పెండెల సాయితేజ అంతర్జాతీయ బ్లైండ్ గోల్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నట్లు కోచ్ శివకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2025న ఈజిప్టులో జరగనున్న అంతర్జాతీయ బ్లైండ్ గోల్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా, సమ్మేళిత ఫౌండేషన్.. ఎంపికై న జాతీయ జట్టు క్రీడాకారులకు వసతులు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సివిల్స్ శిక్షణ పొందుతున్న సాయితేజ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాలిక ఆత్మహత్య
వర్ధన్నపేట: కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని పిరంగడ్డ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎస్సై బండారి రాజు కథనం ప్రకారం..పిరంగడ్డకు చెందిన రాజబో యిన ఎల్లయ్య కూతురు రాజశ్రీ దేవి(15) కొంత కాల క్రితం కడుపు నొప్పికి చికిత్స పొందింది. అ యినా తగ్గడం లేదు. ఈ క్రమంలో నాలుగు రోజు లుగా నొప్పి ఎక్కువ అయ్యింది. దీంతో ఆదివారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రాజబో యిన ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
వ్యవసాయ భూమి ఇవ్వాలని..
● రైతుపై హత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్ : ఓ రైతు సొంత వ్యవసాయ భూమిని తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతడి అన్న కుమారులు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం సాధు తండా గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. సాధు తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ బాబుకు మూడు ఎకరాల మూడు గంటల వ్యవసాయ భూమి ఉండగా అతడి పెద్ద కుమారుడు వీరన్న పేరున 37 గుంటలు ఉంది. ఇద్దరు రైతులకు సంబంధించిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బానోత్ బాబు అన్న బానోత్ సామ్య పెద్ద కొడుకు హుస్సేన్, అతడి భా ర్య లక్ష్మి, కుమారుడు సాయి, చిన్న కొడుకు హతీ రాం తదితరులు బాబు వ్యవసాయ భూమి తమకు ఇవ్వాలని కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. తన సొంత భూమి ఎందుకు ఇస్తానని బాబు పేర్కొంటూ పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా కురవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా వారిపై కేసులు నమోదయ్యాయి. అయినా బాబు వ్యవసాయ భూమిలో ఎకరం తమకు ఇవ్వాలని సామ్య కుమారులు కొంతకాలంగా గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బాబు, అతడి చిన్న కుమారుడు భద్రు, కోడలు భూమిక తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా హుస్సేన్, లక్ష్మి, సాయి, హతీరాం అక్కడికి వచ్చి గొడవకు దిగారు. అంతలోనే నాగలి కాణి తీసుకుని బాబుపై హత్యాయత్నం చేయగా అతడికి తీవ్రగాయాలయ్యాయి. భద్రు, భూమికకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా, భూమిక మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడు అపహరణకు గురైంది. ఈ ఘటనపై బాధితులు కురవి పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. తీవ్రగాయాలైన బాబును 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.

అంతర్జాతీయ బ్లైండ్ గోల్‌బాల్ పోటీలకు సాయితేజ

అంతర్జాతీయ బ్లైండ్ గోల్‌బాల్ పోటీలకు సాయితేజ