
ఎమ్మెస్సీ జియాలజీతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎమ్మెస్సీ జియాలజీలో ప్రవేశాలు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. క్యాంపస్‌లో 1989లో 12 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రారంభించిన జియాలజీ విభాగంలో ప్రస్తుతం 40 సీట్లకు పెంపుదల చేశారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, స్వయం ఉపాధి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వివిధ కంపెనీలు కూడా ప్రాంగణ నియామకాలతో ఎంపిక చేసుకుంటున్నాయి.
ఎమ్మెస్సీ జియాలజీలో
ప్రవేశాలకు అర్హత పరీక్ష
ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులకు నిర్వహించే సీపీగేట్ –2025కు దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 17వ తేదీవరకు గడువు ఉంది. ఎమ్మెసీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు డిగ్రీలోని ఏసైన్స్ విభాగంలోనైనా ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు అర్హులు. సీపీ గేట్ ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
యువతకు ఉజ్వల భవిష్యత్
ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు పూర్తి చేసిన యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంది. కేంద్ర ప్రభు త్వ సంస్థల్లోనూ ఉద్యోగాలు న్నాయి. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్‌వాటర్ బోర్డు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, అటామిక్ మినరల్ డివిజన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ బోధన, పరిశోధన సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ, రాష్ట్ర భూగర్భ జలశాఖ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగావకాశాలున్నాయి.
–ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి,
జియాలజీ విభాగం అధిపతి,కేయూ
కేయూ ఆ విభాగంలో ప్రత్యేకతలు
డిగ్రీ ఏ సైన్స్‌లో ఉత్తీర్ణత పొందినా
ప్రవేశానికి అర్హత
సీపీగేట్‌కు దరఖాస్తులకు
ఈనెల 17వరకు గడువు

ఎమ్మెస్సీ జియాలజీతో ఉపాధి అవకాశాలు