
ఓరుగల్లుతో ‘కోట’కు అనుబంధం
హన్మకొండ కల్చరల్: విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందారు. ఆయన మృతిపై వరంగల్ నగరవాసులు దిగ్భ్రాంతి చెందారు. ఈసందర్భంగా వరంగల్ నగరవాసులు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు నాటక కళాకారులు కూడా కావడంతో కొన్నేళ్ల క్రితం కేఎంసీలో జరిగిన పోటీల్లో ఒక నాటకంలో కూడా ప్రదర్శన ఇచ్చారని కవి, సహృదయ సంస్థ సభ్యులు ఎన్వీఎన్ చారి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మృతిపై సహృదయ కార్యవర్గం, తెలంగాణ నాటక సమాజాల సమైక్య అధ్యక్షుడు ఆకుల సదానందం, అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్, సీనియర్ కళాకారులు కాజీపేట తిరుమలయ్య, జేఎన్ శర్మ, ఓడపల్లి చక్రపాణి, జూలూరు నాగరాజు, పలువురు కళాకారులు, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ సంతాపం తెలిపారు.
‘కోట’ మరణం బాధాకరం
విలన్‌గా, కమెడియన్‌గా, తండ్రిపాత్రలో నటించి విలక్షణమైన నటుడిగా పేరుపొందిన కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. 1990లో లష్కర్‌బజార్ హైస్కూల్ జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సందర్భంగా పరిచయం చేసుకుని ఫొటో దిగా.
– మట్టెవాడ అజయ్‌కుమార్,
మైక్రో ఆర్టిస్ట్, వరంగల్
అమ్మవారి దర్శనానికి వరంగల్‌కు వచ్చిన కోట శ్రీనివాసరావు
ఆయన మృతితో దిగ్భ్రాంతి చెందిన ఉమ్మడి జిల్లా కళాకారులు