
భార్య మృతి తట్టుకోలేక భర్త కన్నుమూత
చిల్పూరు: భార్య మృతి తట్టుకోలేక భర్త కన్నుమూశాడు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా చిల్పూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సట్ల చెన్నయ్య(85), నర్సమ్మ దంపతులకు సంతానం లేరు. సుధీర్‌ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన నర్సమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. ఆదివారం ఆమె దశదిన కర్మ చేసేందుకు చెన్నయ్య కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానవాటికకు వెళ్లా డు. కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కి చనిపోయాడు. చెన్న య్య మృతితో చిల్పూరులో విషాదఛా యలు అలుముకున్నాయి. ఆయన మృతికి కాంగ్రెస్ నాయకులు జక్కం భాస్కర్, గణగోని రమేశ్, పొన్నం శ్రీను, కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు.

భార్య మృతి తట్టుకోలేక భర్త కన్నుమూత