
జనాభా నియంత్రణపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పంచాయతీ స్థాయిలో ఈనెల 18వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ రవిరాఽథోడ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీజీహెచ్ నుంచి నెహ్రూసెంటర్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణ అవసరాన్ని గురించి ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల ప్రపంచ సవాళ్లకు మూలమని, పెరుగుతున్న జనాభా వల్ల కలిగే నష్టాల గురించి వివరించాలన్నారు. దంపతులు బిడ్డకు, బిడ్డకు మధ్య కొంత సమయం కేటాయించాలని, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చన్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి అభినందలు తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్‌ఎంఓ జగదీశ్వర్, డాక్టర్ సారంగం, సుధీర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, డెమో కొప్పు ప్రసాద్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుబాయి, హెచ్‌ఈ రాజు, రామకృష్ణ, లోక్య, మనోహర, అరుణ్, అనిల్, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫైలేరియా నియంత్రణకు చర్యలు
జిల్లాలో ఫైలేరియా నియంత్రణకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. జాతీయ ఫైలేరియా నియంత్రణలో భాగంగా ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందికి శుక్రవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడు తూ.. ఫైలేరియా వ్యాధికి కారణమైన దోమల నివా రణకు పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పాటించాలన్నారు. జోనల్ మలేరియా ఆఫీసర్ సునీల్‌కుమార్, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష శిక్షణ అందించారు. ప్రోగ్రాం అధికారులు సుధీర్‌రెడ్డి, సారంగం, లక్ష్మీనారాయణ, ప్రసాద్, రాజు, పురుషోత్తం, రామకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్