
ఎక్కువ మంది పిల్లల్ని పెంచడం కష్టం..
గూడూరు: నా పేరు ఎడ్ల నరేశ్‌రెడ్డి. మాది గూడూరు మండలం సీతానగరం శివారు రెడ్డిపల్లె గ్రామం. నన్ను మా బంధువులు చిన్నతనంలో దత్తత తీసుకొని పెంచి పెద్దవాడిని చేశారు. మాకు ఎకరం పొలం ఉంది. 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మా కూతురు శ్రీముఖ 8వ తరగతి చదువుతుంది. ఒక్కరు చాలు అనుకున్న.. కానీ గత సంవత్సరం కుమారుడు ఆర్యనాథ్‌రెడ్డి జన్మించాడు. ఆటో, ట్రాలీ, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. ఏడాదిగా కాంగ్రెస్ పార్టీలో గ్రామ నాయకుడిగా ఎదిగాను. దీంతో ఎమ్మెల్యేలు మురళీనాయక్, దొంతి మాధవరెడ్డి సహకారంతో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా నియామకమయ్యాను. కొంతకాలంగా కొంచెం చెప్పుకునే విధంగా జీవనం కొనసాగుతుంది. అయితే నేటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కష్టం. వారికి కావాల్సినవి ఇవ్వడంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఒక్కరు లేదా ఇద్దరు పిల్ల లతో సరిపెట్టుకుంటే మంచిదనేది నా ఆలోచన.