
ఓరుగల్లులో తగ్గిన జననాల రేటు
రాష్ట్ర జననాల సగటులో
13వ స్థానంలో ఉమ్మడి జిల్లా
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్‌లో జననాల రేటు రోజురోజుకూ పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది పార్లమెంట్‌లో దేశంలోని రాష్ట్రాల వారీగా జనన, మరణాలపై నివేదిక సమర్పించింది. బర్త్ రేటు (జననాల రేటు) తగ్గిందని 2021లో దేశవ్యాప్తంగా నమోదైన జనన రిజిస్టర్ రిపోర్ట్‌నూ వెల్లడించింది. 2021లో జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో 2001 నుంచి 2011 పదేళ్లలో సుమారు 42 లక్షల మంది జన్మిస్తే.. 2021 నాటికి ఆ జననాల సంఖ్యతో పోలిస్తే సంఖ్య 5.58 లక్షలు తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్‌లో జననాల రేటును పరిశీలిస్తే 2011 నుంచి తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు జనాభా వృద్ధి రేటు ప్రకారం గంటకు 60–70 మంది నుంచి 30–35కు పడిపోయింది. ఇందుకు కరోనా మహమ్మారి తర్వాత జననాల సంఖ్య తగ్గిందనేది ఒక కారణం కాగా.. చాలా మంది ఒక్కరు, లేదా ఇద్దరితో సరిపెట్టుకోవడం కూడా కారణమని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలు, రాష్ట్రంలో జననాల రేటు ఇ లాగే తగ్గితే వచ్చే 20 ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి సీని యర్ సిటిజన్లు పెరుగుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
1951 జనాభా వృద్ధి ఇలా..
సాధారణంగా ప్రతీ పదేళ్లకు ఒకసారి దేశ జనాభాను లెక్కిస్తా రు. 1872లో మొదటిసారి జనాభాను లెక్కించినప్పటికీ... స మగ్ర జనగణన 1881లో చేపట్టారు. 1952 నుంచి మనదే శంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ‘కుటుంబ ని యంత్రణ’ కార్యాచరణ మొదలైంది. రెండు దశాబ్దాలు ఈ కార్యక్రమం సీరియస్‌గా సాగినా.. ఆ తర్వాత నెమ్మదించింది.
2011 నుంచి జననాల రేటు తగ్గుముఖం..
ఐదేళ్లలో పుట్టింది 70 వేల మందే..
ఇలాగైతే వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న సీనియర్ సిటిజన్లు
ఆందోళన కలిగిస్తున్న జననాల సంఖ్య
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా రేటు ఇలా..
సంవత్సరం జనాభా పెరిగిన జనాభా శాతం
1951 13,29,836 +2,04,177 +18.14
1961 15,45,435 +2,15,599 +16.21
1971 18,70,933 +3,25,498 +21.06
1981 23,00,295 +4,29,362 +22.95
1991 28,18,832 +5,18,537 +22.54
2001 32,46,004 +4,27,172 +15.15
2011 35,12,576 +2,66,572 +8.21
2021 37,50,000 +2,37,424 +6.33
2025 38,20,000 +70,000 +1.83