మొగుళ్లపల్లి: ఓటరు గుర్తింపు కార్డు ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే నేరుగా ఇంటికే రానుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతను చైతన్యపర్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
మార్పులు, చేర్పులు కూడా..
ఇదివరకే ఓటరుగా నమోదై జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు కార్డు పంపించనున్నారు. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం ఓటర్లకు ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు చేయడానికి నెలకు పైగా సమయం పడుతుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది.
కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
ఓటరు నమోదును ప్రోత్సహించడానికి సరికొత్త మార్గం
అర్హులు ఓటరుగా నమోదు కావాలి..
అర్హులు ఓటరుగా నమోదు కావాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే గుర్తింపు కార్డు రానుంది.
–సునీత, తహసీల్దార్, మొగుళ్లపల్లి
15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు