
సిగాచి పరిశ్రమలో అఖిల్ మృతి..
● మృతుడిది తొర్రూరు మండలం మడిపల్లి
● వివాహమైన ఆరునెలలకే విషాదం..
తొర్రూరు రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మోత్కూరి అఖిల్(29) మృతి చెందాడు. రెండు సంవత్సరాల నుంచి సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అఖిల్.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో డీఎన్‌ఏ పరీక్షలకు పంపించి అఖిల్‌గా నిర్ధారించారు. కాగా, అఖిల్‌కు ఆరు నెలల క్రితం శివరాణి అనే యువతితో వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో భార్య శివరాణి, తల్లిదండ్రులు రాజేందర్, రాణి కన్నీరుమున్నీరవుతున్నారు.

సిగాచి పరిశ్రమలో అఖిల్ మృతి..