
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
కేసముద్రం: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గణపతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సీపీఐ 19వ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, మంద భాస్కర్, లక్ష్మీనర్సయ్య, రవీందర్, ఇమామ్, సోమయ్య, వెంకటయ్య, సారయ్య, అనిత, కోటయ్య, సుధాకర్ పాల్గొన్నారు.