డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–డెహ్రాడూన్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల సర్వీస్‌ల వివరాలు..
ఈ నెల 17, 24వ తేదీల్లో చర్లపల్లి–డెహ్రాడూన్ (07077) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం ఉదయం 6.23 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ నెల 12,19, 26వ తేదీల్లో డెహ్రాడూన్ –చర్లపల్లి( 07078) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం ఉదయం 7 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉత్తర, దక్షిణ భారతదేశ పర్యాటక కేంద్రాలకు వెళ్లే పర్యాటకులకు ఈ రైళ్ల సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, రాణి కమలాపతి, భీనా, ఝాన్సీ, ఆగ్రా, మధుర, హజ్రత్‌నిజాముద్దీన్, మీరట్, రూర్కి, హరిద్వార్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కరీంనగర్ కలెక్టర్‌ను కలిసిన యశ్వంత్
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ మంగళవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్.. కలెక్టర్‌కు మొక్క అందించాడు. ఎల్లప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం, ఆశీస్సులు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని కలెక్టర్ సత్పతి ఈ సందర్భంగా యశ్వంత్‌కు సూచించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను ధృడసంకల్పంతో అధిరోహించి భారతదేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటాలని యశ్వంత్‌కు తెలిపారు.
రెండో రోజు విద్యుత్
కొనుగోలు ఒప్పందం
హన్మకొండ: ‘పీఎం కుసుం’ పథకంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం మంగళవారం రెండో రోజు కొనసాగింది. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కంపెనీ పరిధిలోని 16 సర్కిళ్ల నుంచి రైతులు చేరుకున్నారు. 461 మందికి రెడ్‌కో లెటర్ ఆఫ్ అక్సెప్టెన్సీ జారీ చేయగా సోమవారం మొదటి రోజు ఇరువురి మధ్య 37.50 మెగావాట్లకు చెందిన 38 ఒప్పందాలు జరిగాయి. రెండో రోజు దాదాపు 45 మెగావాట్లకు చెందిన 47 ఒప్పందాలు జరిగాయి. జూలై 7 వరకు పవర్ పర్చేజ్ ఒప్పందాలు చేసుకోవచ్చని రెడ్‌కో హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై రైతులతో పాటు ఎన్పీడీసీఎల్ నుంచి ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ సంతకాలు చేశారు.
డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైళ్లు


