సర్కారు బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: సర్కారు బడుల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెంచాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో ఉపాధ్యాయులను ఆదేశించారు. మానుకోట పట్టణంలోని వివేకానంద సెంటర్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 19వ వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, భోజన వసతి ఉంటుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు డిజిటల్ బోర్డుపై బోధిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, సైన్స్‌ఫెయిర్, క్రీడలు, యోగా వంటివి ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పిస్తున్నట్లు బడిబాట కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయాలన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మదర్ థెరిస్సా సెంటర్‌లో తెలంగాణ సాంస్కృతిక కళాబృందం జానపద పాటలు ఆలపించింది. ఈ కార్యక్రమంలో ఏడీ రాజేశ్వర్, ఏజీసీ మందుల శ్రీరాములు, ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, సైన్స్ అధికారి అప్పారావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ పూర్ణచందర్, హెచ్‌ఎంలు వెంకటేశ్వర్లు, హల్యానాయక్, సిరినాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మానుకోట పట్టణంలో బడిబాట ర్యాలీ
సర్కారు బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి


