
మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలి●
● మానవ హక్కుల వేదిక డిమాండ్
హన్మకొండ: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను కు టుంబ సభ్యులు, బంధువులకు అప్పగించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అ ధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈనెల 21న ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు చనిపోయారని, ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సజ్జ వెంకటనాగేశ్వరరావు (రాజన్న), వన్నాడ విజయలక్ష్మి (భూమిక), గోనెగండ్ల లలిత (సంగీత), బుర్ర రాకేశ్ (వివేక్ ) ఉన్నారని వారు సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. వీరి కుటుంబీకులు, బంధువులు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ పీఎస్, ఆస్పత్రి ఎదుట ఐదు రోజులుగా పడిగాపులు కాస్తున్నా అక్కడి పోలీసులు మృతదేహాలను అప్పగించడం లేదన్నారు. ఉదయం, సాయంత్రం అంటూ కాలం వెల్లదీస్తూ మృతదేహాలను అప్పగించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వెంటనే మావోయిస్టు మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.