
మార్పుతోనే పంట సిరులు!
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025
జిల్లాలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, అదివాసీలు అధికంగా ఉన్న మానుకోట జిల్లాలో నూటికి డైబ్బెశాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కాగా అతి వృష్టి, అనావృష్టితో పాటు చీడపీడల బెడదతో ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు. ఇటువంటి ప రిస్థితి నుంచి రైతులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మూస పద్ధ్దతి మారాలి.. ఫలితం పెరగాలి’ అనే ఆలోచనతో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి వారి సమస్యలు విని, సలహాలు, సూచనలు ఇస్తూ వానాకాలం సాగుకు సన్నద్ధం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా పర్యటన
జిల్లా వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ అధికారులతోపాటు కృషి విజ్ఞానకేంద్రం మల్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు టీమ్‌గా ఏర్పడి రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం పేరుతో జిల్లా వాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 5నుంచి జూన్13 వరకు అన్ని మండలాలు పర్యటించనున్నారు. ఇందులో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓతోపాటు, ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సదరు ఉపాధ్యాయులు రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సూచనలు విని బడిలో విద్యార్థులకు చెప్పాలి. వారి ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలనేది ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
ప్రధాన అంశాలు
రైతులు నష్టపోవడం, దిగుబడి రాకపోవడం మొదలైన కారణాలకు మూలమైన అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. వరిలో వెదజల్లే పద్ధతి, పత్తిలో అధిక సాంద్రత పద్ధతి పాటించాలి. యూరియా, ఇతర రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. ఇందుకోసం పచ్చిరొట్ట, జీలుగు, పెసర వంటి పంటలు వేసి కలియదున్నాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇందుకోసం తక్కువ కాల పరిమితి వంగడాలను సాగుచేయాలి. గట్లపై, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లను పెంచాలి. దీని ద్వారా వాతావరణంలోని సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానంగా పంట మార్పిడి పద్ధతి పాటించాలి. రెండు మూడు సంవత్సరాలకోసారి మట్టి పరీక్షలు నిర్వహించాలి. పోషక విలువల అధారంగా ఇతర ఎరువులు వాడాలి. ఎరువులు కొన్నప్పుడు రశీదు పొందాలి.. భద్ర పర్చుకోవాలి. వీటితోపాటు స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
●
న్యూస్‌రీల్
నూతన పద్ధతుల్లో పంటల సాగుపై రైతులకు అవగాహన
మూస పద్ధతికి స్వస్తి పలకాలని సూచన
వానాకాలం సాగుకు ముందు రైతుల సన్నద్ధం

మార్పుతోనే పంట సిరులు!

మార్పుతోనే పంట సిరులు!

మార్పుతోనే పంట సిరులు!

మార్పుతోనే పంట సిరులు!

మార్పుతోనే పంట సిరులు!