
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
ఉపాధి హామీ
పనులతో రైతుల
పొలాలకు దారి
● కిలో మీటరుకు
రూ. 6లక్షలు కేటాయింపు
● సొంత పొలానికి దారి వేసుకునేందుకు
రైతులే కూలీలుగా అవకాశం
● జిల్లాలో 80 కిలోమీటర్ల
దారి వేయడమే లక్ష్యం
సాక్షి, మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రైతులకు వరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న పనులకు తోడుగా రైతుల పొలాలు, చెలకలకు ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రోడ్డు వే సుకునే అవకాశం కల్పించారు. దీంతో కూలీలకు పని కల్పించడమే కాకుండా పొలాలకు దారిలేక రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా తొలగనున్నాయి.
ఎక్కువ పనిదినాలే లక్ష్యం
ఎంత పని చేస్తే అన్ని నిధులు అన్నట్లు ఉపాధి హామీ పథకంలో ఎంత ఎక్కువ పనిచేసే గ్రామాలకు అంత ఎక్కువ నిధులు వస్తాయి. కూలీల పని దినాల ఆధారంగా 60శాతం కూలి, 40శాతం మెటీరియల్ కాంపౌండ్ కింద కేటాయిస్తారు. అయితే గత ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. దీంతో రూ.18.31కోట్లు వెనక్కి వెళ్లాయి. దీంతో ఈజీఎస్ నిధుల వినియోగంలో మానుకోట జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది ముందు నుంచే నిధుల వినియోగం, కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో 2,20,438 జాబ్ కార్డులు ఉండగా ఇందులో 1,36,814 కార్డులపై యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,28,582 పనిదినాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలరోజుల్లో జంగల్ కటింగ్, రోడ్లు వేయడం, కందకాలు తవ్వడానికి 5,99,178 పనిదినాలు వినియోగించుకున్నారు. మిగిలిన పనులు వేగవంతం చేసేందుకు ఈజీఎస్‌లోని అన్ని రకాల పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కిలోమీటరుకు రూ.6లక్షలు
ఉపాధి పనుల్లో భాగంగా రైతుల పొలాలకు దారి వేస్తుండగా.. కిలోమీటరు పొడవు దారికి రూ. 6లక్షలు కేటాయించారు. ఇందులో 60శాతం వరకు చె ట్లు కొట్టడం, కందకాలు తవ్వడం మొదలైన పనుల నిమిత్తం కూలీలకు రూ.4,45,000 చెల్లిస్తారు. అదే విధంగా గ్రావెల్ పోయడం, మోరీలు వేయడం వంటి మెటీరియల్ పనులకు రూ.1.55,000 కేటా యించారు. ఈ ఏడాది జిల్లాలో మండలానికి ఐదు కిలోమీటర్ల చొప్పున మొత్తం 16 మండలాలకు 80 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ఏపీఓల నుంచి ప్రపోజల్స్ తీసుకున్నారు. ఇందుకుగాను ఈ ఏడాది రైతు పొలాల దారి కోసం మొత్తం రూ.4.80కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో ఇప్పటి వరకు 50వేల పనిదినా లు కల్పించారు. ఈ వేసవిలో మిగిలిన పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది.
పెద్దవంగరలో ఈజీఎస్ పనులతో పొలాలకు దారి వేస్తున్న కూలీలు
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025