
రైతుల సమస్యలు పరిష్కరించాలి
దంతాలపల్లి: భూభారతి చట్టం అమలులో భాగంగా మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రైతుల సమస్యలు పరిష్కరించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని పెద్దముప్పారం, ఆగపేట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మా ట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారం కోసం రైతులు ఇచ్చిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ప రిష్కరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చా రు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎంపీడీఓ వివేక్‌రామ్, ఆర్‌ఐలు రాజు, నజిముద్దీన్,ఎంపీఓ అప్పర్ పాషా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్