
చెరువులో పడి దినసరి కూలీ మృతి
హసన్‌పర్తి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వంగపహాడ్‌కు చెందిన మహ్మద్ అజీజ్ (38) దినసరి కూలీ. స్థానిక బాబోయిన చెరువు వద్దకు శనివారం వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రోడ్డున పడిన కుటుంబం
అజీజ్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. అజీజ్ భార్య కూడా అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందింది. తండ్రి మృతదేహం వద్ద ఇద్దరు కూతుళ్లు బోరున విలపించడంతో అక్కడికి వచ్చిన వారు చలించిపోయారు. అంత్యక్రియలకు కూడా వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదని స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
రోడ్డున పడిన కుటుంబం
అనాథలైన ఇద్దరు కూతుళ్లు

చెరువులో పడి దినసరి కూలీ మృతి