మహబూబాబాద్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రేగ్యులేషన్ స్కీం) రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కా రణంగా రిజిస్ట్రేషన్లు ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్‌ఆర్‌ఎస్ 2020 సాఫ్ట్‌వేర్, ఇతర ప్రక్రియ పూర్తి కాగా ఫీజు చెల్లింపు అంతా మున్సిపాలిటీలో ఇచ్చిన విధివిధానాలే ఉన్నాయి.
జిల్లాలో 26,001 దరఖాస్తులు
2020 ఆగస్టు 26లోపు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇందులో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు రావడంతో దరఖాస్తుదారులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మానుకోట, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం కూడా మున్సిపాలిటీ అయింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 26,001 దరఖాస్తులు రాగా 8,264 ఆమోదించగా 84 తిరస్కరణకు గురి కాగా మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 8,264 దరఖాస్తుదారుల్లో కూడా 389 మంది మొత్తం ఫీజు చెల్లించి అనుమతి తీసుకోగా 7,875 మంది ఫీజు పెండింగ్‌లో ఉన్నాయి.
25 శాతం రాయితీతో..
ప్రభుత్వం త్వరగా ఎల్‌ఆర్‌ఎస్ తీసుకోవాలని దరఖాస్తుదారుల కోసం ఈనెల 31వ తేదీలోపు ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీ ప్రకారం ఉన్న విలువలో 14శాతం ఫీజు చెల్లించాల్సి ఉంది.మున్సిపాలిటీల్లో కేవలం దరఖాస్తు చే సుకున్న వారికిమాత్రమే ఈ అవకాశం కల్పించింది.
ఫీజు చెల్లించకపోయినా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు మాత్రం మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లోనే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూ.1000 చెల్లించినా.. చెల్లించకపోయినా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వే నంబర్, ఇతర అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు.
రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు..
మానుకోట జిల్లా కేంద్రం కేంద్రంలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలో ఈనెల 10 (సోమవారం) నుంచి ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లపై సమాచారాన్ని పూర్తి వివరాలు తెలియచేసేందుకు ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ము న్సిపల్ కమిషనర్‌లతో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు.
రేపటి నుంచి అందుబాటులోకి సేవలు..
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఈ నెల 31 వరకు 25శాతం
రాయితీతో అవకాశం