
మాట్లాడుతున్న మంత్రి సురేఖ
వరంగల్: వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎ క్కువ సాధిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నా రు. గురువారం రాత్రి పోచమ్మమైదాన్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మా ట్లాడుతూ కొండా దంపతులు సన్మానాలకు దూరమన్నారు. సన్మానాలకు అయ్యే ఖర్చుతో అనాథలకు భోజనం అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఆరు గ్యారంటీల్లోని ఐదింటిని 100 రోజుల్లో అమలు చేశామన్నారు. అంబేడ్కర్‌పై మాట్లాడే నైతిక విలువ కేసీఆర్‌కు లేదని, రాజకీయాల్లోకి అసభ్య పదజాలం తీసుకువచ్చింది కేటీఆర్, కేసీఆర్‌లే అని గుర్తించాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించిన క్షణం.. కొండా దంపతులు తన బిడ్డకు నిండు ఆశీర్వాదం అందించారన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ రాజకీయాల్లో ఎలా ముందుకు పోవాలో కొండా సురేఖ చెబుతున్నారని, ఈ సమావేశం చూస్తే తన గెలుపు ఖాయం అనిపిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ కొండా మురళీధర్ మాట ఇస్తే.. తప్పడన్నారు. కడియం కావ్యకు 50వేల మెజార్టీ ఇస్తామన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్లు, నాయకులు నవీన్‌రాజు, ప్రకాశ్, ప్రభాకర్, శ్రీనివా స్, శ్రీనివాస్, రాజేష్, రవీందర్ పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ