సందర్భం : 1947లో 3నెలల నగర బహిష్కరణ శిక్ష ముగిసిన తర్వాత వరంగల్‌కు వచ్చినప్పుడు
స్టేటు కాంగ్రెసు లక్ష్యసిద్ధికై మనకు/మొగలయ్య చూపిన ముల్యమే పథము/శాంతిదూతల మనుచు చాలెంజ్‌చేయ.../ నిందమోహిన వాడే నిందితుగుకాగా/మా వూరికే మేము మరలివచ్చితిమి/ మూడు నెల్లాకాంక్ష ముండమోసినది/ వెళ్లగొట్టిన వెధవె వెళ్లిపోయినాడు.
సందర్భం: 1966లో వరంగల్లులో ఆంధ్రప్రదేశ్ కవులను సన్మానించే కార్యక్రమంలో భాగంగా కాళోజీని సన్మానించినప్పుడు..
నా గొడవ
నా గొడవనునది/కాళోజీ అనునది/నా గొడవనునది/వాగుడు అనుపించునది/ఎడతెగని వాగుడది/ఎడతెగక సాగునది/అక్షరజీవన మనునది/ నా గోడవనుది ..../ కాలమునకే కాదు మహా/కాలునకును ఏనాడును/ జీ అనని కలేజాతో/కాళోజీ అనునది/నా గొడవనునది...
సందర్భం: 1969లో కుటుంబ నియంత్రణపై జరిగిన కవి సమ్మేళనంలో..
ప్రకృతి సిద్ధ ధర్మానికి/ ప్రతికూలము కాని నడక/ సతీపతుల సౌఖ్యానికి/సంకటము లేని నడక../పుట్టేవారి పొట్టకు బట్టకు/దిట్టమైన ఏర్పాట్లు ఏవియును/కల్పించక, కనించుట, కనుట/కసాయితనము, పిశాచి వూనము..
సందర్భం : 1969 మే 1న వరంగల్‌లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రజాసమితి సదస్సులో చదివిన కవిత..
దోపిడీ చేసే ప్రాంతేతరులను/దూరం దాకా తన్ని తరుముతం/ ప్రాంతం వాడే దోపిడి చేస్తే/ ప్రాంతంతోనే పాతరవేస్తం/దోస్తుగ ఉండే వారితో మేమును/దోస్తే చేస్తం–ప్రాణమిస్తం/ఎవతకు అంత అన్న ధోరణితో/చింతమాని రబతుకును సాగిస్తం/ తెలంగాణమిది –తెలంగామిది/తీరాన దూరాన వున్నది/ముంచే యత్నం చేస్తే తీరం/మునుగును తానే–మునుగును తప్పక
సందర్భం: 1970లో వరంగల్‌లో నూతన గజానన మండలి యాభైవ వార్షిక మహోత్సవం సందర్భంగా రాసిన కవిత...
గణపతీ / అదృష్ట జాతకం నీది/ కన్నతల్లి సర్వమంగళ/కన్న తండ్రి సాక్షాత్ శివుడు.../ఫలానా అబ్బాయివని /వారసత్వంగా / అధికార దక్కదు సుమా ఈ రోజుల్లో/ గణం విసిగోయింది/ఇదే ఆల్టిమేటం ఇస్తున్నాను/వచ్చే ఏడు/ మళ్లీ నీకు ఆహ్వానం లేదు/ ఈసారి ఉద్వాసన మాత్రమే తుదిది.