ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో బెదిరింపు | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో బెదిరింపు

Jan 17 2026 7:33 AM | Updated on Jan 17 2026 7:33 AM

ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో బెదిరింపు

ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో బెదిరింపు

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం గోశాలలో ఔట్సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో లో బెదిరింపులకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం గోశాల పర్యవేక్షకులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని గత మూడు నెలలుగా జీతం రాకుండా చేశాడని వీడియోలో ఆరోపించారు. 2020లో గోశాలలో గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో పనిచేయడానికి నియమించారని తెలిపారు. మూడు నెలల క్రితం గోశాల పర్యవేక్షకులుగా విధులు చేపట్టిన రాజశేఖర్‌ తన నెలసరి వేతనం రాకుండా చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంపై పర్యవేక్షకులు రాజశేఖర్‌ సంప్రదించగా గో ఉత్పత్తుల కేంద్రంలో పనిచేసే రాజు విధులకు గైర్హాజరవుతున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లానన్నారు. ఈ విషయంపై వన్‌టౌన్‌ సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబును సంప్రదించగా గోశాల రాజును పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం

పాణ్యం: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తమ్మరాజుపల్లెకు చెందిన కల్ప నాగరత్నమ్మ(60) అనే వృద్ధురాలు చెందారు. ఈ దుర్ఘటన తెల్లవారుజామున తమ్మరాజుపల్లె సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికుల ఫిర్యాదు మేరకు హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. కల్ప నాగరత్నమ్మ కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, ఈమెకు కుమార్తె రేణుక ఉన్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.

బైక్‌ ఢీకొని మహిళ మృతి

పాములపాడు: మండలంలోని వాడాల గ్రామంలో జీవమ్మ(50) అనే మహిళ బైక్‌ఢీకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు జరిగింది. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15న వాడాల గ్రామంలో వారపు సంత జరుగుతుండగా ఆమె కూరగాయలతో ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్‌ ఢీ కొంది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. మృతురాలి పెద్ద కుమారుడు మాధవరం బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటులఎస్‌ఐ తెలిపారు.

కేసీ కెనాల్‌లో వృద్ధుడి గల్లంతు

పగిడ్యాల: కేసీ కాలువ గట్టుపై బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి వృద్ధుడు గల్లంతయిన ఘటన ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పడమర ప్రాతకోటలో శుక్రవారం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గడివేముల గ్రామానికి చెందిన అచ్చన్న గౌడ్‌(80) సంక్రాంతి తిరునాలకు మనువరాలు చరిత ఇంటికి వెళ్లాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లి బ్రిడ్జి సమీపంలో సిమెంట్‌ బెడ్‌పై అమర్చిన మట్టి బస్తాల మీదుగా కేసీ కెనాల్‌లోకి దిగాడు. ఈ క్రమంలో అదుపు తప్పిలో అందులో జారిపడ్డాడు. గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించేలోగా నీటి ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బంధువులు వృద్ధుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా మృతదేహం లభ్యం కాలేదు.

రోడ్డు ప్రమాదంలో శివ మాలధారుడు మృతి

బేతంచెర్ల: ద్విచక్రవాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టడంతో శంకరాపురం గ్రామానికి చెందిన శివమాలధారుడు శరవేణి దస్తగిరి మృతి చెందాడు. సీతారామాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పని నిమిత్తం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి శరవేణి దస్తగిరికి తీవ్రగాయాలు అయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. దస్తగిరి(33)కి భార్య సుజాత, ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాల్‌ తెలిపారు.

కుందూలో వృద్ధురాలి మృతదేహం

ఉయ్యాలవాడ: మండలంలోని అల్లూరు గ్రామ సమీపంలో కుందూనదిలో వృద్ధురాలు శూలం లక్ష్మిదేవి(75) మృతదేహం శుక్రవారం కనిపించింది. వైఎస్సార్‌ జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన లక్ష్మిదేవి మెట్టినిల్లు నుంచి తరుచుగా తన సొంత గ్రామమైన సంజామల మండలం వసంతాపురం, కోవెలకుంట్ల మండలం కలుగొట్ల వద్ద కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వస్తూ వెళ్లేది. ఈమె అనారోగ్యంతో బాధపడుతూ వుండేది. ఈమె భర్త వీరయ్య కూడా గతంలోనే మృతిచెందాడు. ఈ నెల 11న కలుగొట్ల వద్ద ఆశ్రమానికి వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పి వచ్చింది. ఐదు రోజులైనా ఇంటికి రాకపోవడంతో పుట్టింటికి వెళ్లి ఉంటుందని కుమారుడు అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధురాలు కుందూనదిలో విగతజీవిగా కనిపించింది. ఉయ్యాలవాడ పోలీసులు ఆధార్‌ కార్డు ఆధారంగా సమాచారం బంధువులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement