పతనమైన కొత్తిమీర ధర
గోనెగండ్ల: ఈ ఏడాది సాగుచేసిన పంటలకు ఆశించిన మేర ధరలు లేకపోవడంతో రైతులు బోర్లు బావుల కింద కొత్తిమీర సాగు చేశారు. గత 20 రోజుల క్రితం ఒక మడి ధర రూ.800 ఉండగా నేడు రూ.100కు పడిపోయింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ధర లేకపోవడంతో వ్యాపారులు రైతులకు కనిపించకుండా పోతున్నారు. కొత్తిమీర పంట తక్కువ కాలంలోనే వస్తుందని గోనెగండ్ల మండలంలో వెయ్యి ఎకరాలలో సాగుచేశారు. ఒక ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు తెలుపుతున్నారు. ఎకరాలో 200 నుంచి 220 వరకు మడులు వేస్తారు. ఆదివారం ఒక మడి ధర రూ.100 పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


