మధుర జ్ఞాపకాల వేడుక
కర్నూలు సిటీ: పూర్వ విద్యార్థుల సమ్మేళనం గతాన్ని.. వర్తమానాన్ని.. భవిష్యత్తును కలిపే భావోధ్వేగ వారధి. నాలుగు దశబ్దాల క్రితం కలి సి చదువుకున్న బిక్యాంపు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం తిరిగి కలుసుకున్నారు. 1984–85 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న స్కూల్‌ను సందర్శించి ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకొని మధుర జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞాపకాల జడివానలో తడి సి సంబరపడ్డారు. తాము చదువుకున్న స్కూల్ అభివృద్ధి కోసం తమ వంతుగా సహా యం చేస్తామని పూర్వ విద్యార్థులు హామీఇచ్చారు.


