భయం పోగొట్టి.. ఆంగ్లంపై పట్టు పెంచి
కర్నూలు(సెంట్రల్): ఇంగ్లిషు అంటే చాలా మందికి ఏదో తెలియని భయం. దీనిని పోగొట్టేందుకు సాక్షి, అరేనా వన్ స్కూలు ఫెస్టు చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షల్లో విద్యార్థులు తమలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికి తీసి ఉత్తమ ప్రతిభను కనబరిచారు. సెమీ ఫైనల్‌గా భావించే మూడో దశ పరీక్షలను ఆదివారం నగరంలోని రవీంద్ర విద్యానికేతన్‌లో నిర్వహించారు. ఈ పరీక్షకు 70 మంది అర్హత సాధించగా..వారంతా ఉత్సాహంగా హాజరయ్యారు. స్పెల్‌బీతో ఇంగ్లిషులో కష్టమైన పదాలకు సులభంగా అర్థాలు నేర్చుకోవడం, వాక్య నిర్మాణ కూర్పు, వకాబులరీ, గ్రామర్ తదితర అంశాలపై పూర్తి పట్టు సాధించామని ఇవి తమ భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తమని విద్యార్థులు తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఆసక్తి
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రతి ఏడాది అక్టోబర్/నవంబర్‌లలో రెండు, మూడో దశ పరీక్షలకు వందలాదిగా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ నేపథ్యాలు ఉన్నా విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో వారి తరగతి గదిలో నెపుణ్యాలను బట్టి రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో ప్రతిభ కనబరచిన వారిని మూడో దశ అంటే సెమీఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని ఫైనల్‌కు పంపుతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిషులో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో సాక్షి స్పెల్‌బీ పరీక్షలు నిర్వహిస్తోంది. 1, 2 తరగతుల విద్యార్థులను ఒక్క గ్రూపుగా, 3,4,5 తరగతుల విద్యార్థులను రెండో గ్రూపుగా, 6,7 తరగతుల విద్యార్థులను మూడో గ్రూపుగా, 8,9,10వ తరగతుల విద్యార్థులను నాలుగో గ్రూపుగా వర్గీకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్ వేఫి, అసోసియేషన్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి వ్యవహరిస్తోంది.
స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన
సాక్షి, అరేనా వన్ స్కూలు ఫెస్టు
ఆధ్వర్యంలో నిర్వహణ
హాజరైన 70 మంది విద్యార్థులు
నాలుగు కేటగిరీలుగా విభజించి
ఇంగ్లిషు నైపుణ్య, సృజనాత్మక పరీక్షలు
స్పెల్‌బీ ఎంతో ఉపయుక్తమని
సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు,
ఉపాధ్యాయులు
భయం పోగొట్టి.. ఆంగ్లంపై పట్టు పెంచి


