క్రీడలతో మానసికోల్లాసం
నంద్యాల(వ్యవసాయం): క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసికోల్లాసం కలుగుతుందని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ముందుగా 5 జట్లకు టాస్ వేసి జడ్జీలు పోటీలను ప్రారంభించారు. జడ్జీలు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ సెక్రటరీ దాసరి చిన్నలింగమయ్య మాట్లాడుతూ.. పోటీల్లో గెలుపొందిన వారికి ఈనెల 21వ తేదీన జిల్లా జడ్జీల ద్వారా బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్‌బాషా, సుబ్బరాయుడు, రాజేశ్వరరెడ్డి, తోట మురళీ, ఓబులరెడ్డి, రాజేంద్ర, శరత్, కోర్టు సిబ్బంది బాలహాజీ, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం


