ఇంగ్లిషులో మంచి పట్టు సాధించా
నేను ఇంగ్లిషులో మంచి పట్టు సాధించేందుకు స్పెల్‌బీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. వకాబులరీ, స్పీచ్, లిజనింగ్, స్పెల్లింగులు ఎన్నో నేర్చుకున్నా. గతంలో ఉన్న ఎన్నో అనుమానాలకు స్పెల్‌బీతో సమాధానాలు వచ్చాయి. భవిష్యత్‌లో ఇంగ్లిషు సబ్జెక్ట్ అంటే భయపడను. నాకు ఏకాగ్రత పెరిగింది. – కె.తనుష్, 4వ తరగతి,
క్రెడో ది స్కూలు, కర్నూలు
స్పెల్‌బీ పరీక్షకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. ఎన్నో కొ త్త పదాలు నేర్చుకున్నా. కష్టం, కఠినమైన పదాలకు అర్థాలు ఎలా నేర్చుకోవాలో... ఎలా రాయాలో తెలుసుకున్నాను. థ్యాంక్స్ టు సాక్షి. ఇది నా భవిష్యత్‌కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇంగ్లిషులో పూర్తి నైపుణ్యత సాధించేందుకు తోడ్పాటు అందిస్తుంది.
–గౌషియా, 8వ తరగతి, రవీంద్ర విద్యానికేతన్ ఇంగ్లిషు మీడియం హైస్కూలు, కర్నూలు
నాకు స్పెల్లింగులు రాయడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. వాటిని పలికే విధానంపై గందరగోళం ఉండేది. ఇక్కడ ఒక పదాన్ని ఎలా రాయాలి, ఎలా పలకాలన్న దానిపై స్పష్టంగా వివరించారు. దీంతో ఇక ఏ పదాన్నైనా సులభంగా పలికేస్తా, రాసేస్తా. ఇంగ్లిషు అంటే భయం పోయింది. థ్యాంక్స్ టూ సాక్షి. – లాస్య, మూడో తరగతి
ఎడిఫై స్కూలు, కర్నూలు
ఇంగ్లిషులో మంచి పట్టు సాధించా
ఇంగ్లిషులో మంచి పట్టు సాధించా


