21న శ్రీశైలం ఏపీఆర్‌ఎస్‌బీసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కర్నూలు సిటీ: శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (బీసీ)1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21వ తేదీన జరుగనుంది. రాయలసీమ జిల్లాలోని పలువురు ఈ స్కూల్‌లో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. వారంతా ఈ సమావేశానికి రానున్నారు. కర్నూలు నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న కేవీఆర్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఆదివారం వారు నాడు విద్యాబోధన చేసిన గురువుల ఇంటికి వెళ్లి ఆత్మీ య సమ్మేళనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గురువులను ఆహ్వానించిన వారిలో పూర్వ విద్యార్థులు డాక్టర్ శ్రీనివాసులు, డీఈఈ శివనాగరాజు, టీచర్ నాగశేషు, లక్ష్మణాచారి, మారెన్న, శ్రీరాములు, గాంధీ నాయుడు, గిడ్డయ్య, కృష్ణ, పరశురాముడు, రవి కిశోర్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


