జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రిక
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్– శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో ముఖ్య సంరక్షిత జంతువు పెద్ద పులి. దానికి అనారోగ్య సమస్యలు తలెత్తితే కనీసం పరీక్షించేందుకు మత్తు ఇవ్వాలన్నా హైదరాబాద్, తిరుపతి జంతు ప్రదర్శనశాలల నుంచి వైద్యులు రావాల్సి ఉండేది. ఇదంతా నాలుగేళ్ల క్రితం వరకే. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీలో 2021లో వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీని ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. డిస్పెన్సరీ వైద్యులు, సిబ్బంది అరుదైన వన్యప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ ఉన్న వైద్యులను నియమించారు. వారికి ఒక వెటర్నరీ సహాయకుడిని, ఒక న్యాచురాలజిస్ట్ (వన్యప్రాణి ప్రవర్తనను అంచనా వేసేందుకు), మరో ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే అన్ని సౌకర్యాలు కలిగిన ఒక అనిమల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం కూడా ప్రతి అటవీ డివిజన్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా తయారు చేసిన అనిమల్ రెస్క్యూ వ్యాన్ కూడా ఉంది. ఓ వైపు అనుభవం ఉన్న వైద్యులు, మరో వైపు సాంకేతిక పరిజ్ఞానంతో అరుదైన వన్యప్రాణులకు రక్షణగా నిలుస్తున్నారు. సహజంగా అడవిలో ఏదో కారణంగా గాయపడిన వన్యప్రాణిని చేరుకోవడానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. నల్లమల అడవుల్లో విస్తారంగా ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలలో వన్యప్రాణుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఏదైన జంతువు గాయ పడిన విషయం సాధారణంగా కెమోరాల ద్వారానే తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ జంతువు సంచరించే ప్రాంతాన్ని గుర్తించి, దానిని పట్టుకుని వైద్యం అందించేందుకు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు.
వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రెస్క్యూ పార్టీ విధులు ఇలా..
● వన్యప్రాణులను రక్షించి తిరిగి అడవిలోకి వదలడం
● ప్రమాదవశాత్తూ మరణించిన వన్యప్రాణుల పోస్ట్‌మార్టం, దహనం
● పులి దాడిలో మరణించిన పెంపుడు జంతువుల పోస్ట్ మార్టం (లైవ్‌స్టాక్ డిప్రిడేషన్)
● అడవుల్లో అంటువ్వాధుల నిరోధం, పర్వవేక్షణ
● అటవీ సమీప గ్రామాల్లో పెంపుడు జంతువుల వాక్సినేషన్‌పై పర్యవేక్షణ
● వేటగాళ్ల దగ్గర లభించే మాంసాన్ని పరిశీలించి వన్యప్రాణి మాంసంగా నిర్ధారించడం
● అటవీశాఖ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ మానిటరింగ్
● ట్రైనీ ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు శిక్షణా కార్యక్రమాలు
డిస్పెన్సరీ వైద్యుల విజయాలు..
● నల్లమలలో అడవి పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం.
● రాష్ట్రం నలుమూలల చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల సమీపంలోకి వచ్చినపుడు వాటిని పట్టి తిరిగి అడవిలోకి వదలడం.
● అడవి దున్న (గౌర్)ను తిరిగి నల్లమలకు తెప్పించే ప్రాజెక్ట్‌లో సాంకేతిక సహాయకులుగా ఉండటం.
● డిస్పెన్సరీ వైద్యులు రక్షించిన వన్య ప్రాణుల్లో చిరుత, పెద్దపులులు, ఎలుగు బంటి వంటి జంతువులే కాకుండా పాంగోళిన్ (అలుగు), అడవిపంది, పునుగు పిల్లి, మొసలితో పాటు రకాల పక్షులు ఉన్నాయి.
● నల్లమలలో నాలుగు పెద్దపులి కూనలు తల్లికి దూరమై ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని గుమ్మడాపురం గ్రామ శివార్లకు చేరుకోగా బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు వాటిని క్షేమంగా తిరుపతి జంతు ప్రదర్శన శాలకు తరలించారు. కాని అప్పటికే అవి మానవ స్పర్శకు అలవాటు కావడంతో వాటి వన్యజీవన విధానానికి దూరమయ్యాయి. అవి ఇప్పుడు తిరుపతి జూలోనే ఉన్నాయి.
అడవిలో ఎవరి పర్యవేక్షణలో లేని వన్యప్రాణులకు వైద్యం చేయడం అత్యున్నత సేవగా భావిస్తాం. ఎన్నో రకాల వన్యప్రాణులకు చికిత్స చేసి అడవుల్లోకి తిరిగి పంపాం. నెమలి పిల్లలు, గద్ద(కై ట్) వంటి వాటికి ఇక్కడ చికిత్స అందించాం. అవి కోలుకుంటున్నాయి. పెద్దపులి లాంటి ముఖ్య రక్షిత వన్యజంతువు సంరక్షణ మాకు ఎంతో కీలకం. వన్యప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– డాక్టర్ జుబేర్, వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ పశువైద్యులు
డ్రోన్‌తో గుర్తించి.. ఉచ్చు తొలగించి..
వేటగాడు జింకల కోసం పన్నిన ఉచ్చు పెద్దపులి మెడకు బిగుసుకోవడంతో గాయపడింది. బైర్లూటి రేంజ్‌లోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఆ పులిని చిత్రీకరించడంతో విషయం తెలుసుకున్న బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు రంగంలోకి దిగారు. గాయపడిన పులి ఆవాస ప్రాంతం సమీపంలో ప్లాష్ కెమెరాలను ఉంచారు. పులి వాటి సమీపంలో వెళుతున్నప్పుడు ఆటో మేటిగ్గా ప్లాష్ వెలిగి పులి రాకపై సమాచారం అందడంతో అక్కడ మాటు వేసి దాని జాడను కనిపెట్టారు. వంద అడుగుల దూరం నుంచి ఓ వైద్యుడు ట్రాంక్విలైజర్ గన్‌తో మత్తు ఇచ్చాడు. ఆ తర్వాత డ్రోన్‌తో దానిని అనుసరించారు. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి చేర్చి ప్రత్యేక వాహనంలో బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీకి తరలించారు. పులి మెడకు వున్న ఉచ్చును తొలగించారు. ఆహార నాళానికి గాయం తీవ్రంగా ఉండడంతో వైద్యం అందించి తిరుపతిలోని జంతుప్రదర్శన శాలకు తరలించారు. అక్కడ వెటర్నరీ సర్జన్ల చేత ఆపరేషన్ చేసి గాయానికి కుట్లు వేశారు. వారం రోజులు పరిశీలనలో ఉంచారు. దురదృష్టవశాత్తు ఆ పులి కోలుకోలేక మరణించింది.
క్షేమంగా 60 జింకల తరలింపు..
వన్యప్రాణులను ఒకచోట నుంచి మరో చోటికి తరలించడం అంటే అది ఒక పెద్ద టాస్క్. ఇలాంటి తరలింపుల్లో గమ్యం చేరేది 50 శాతం మాత్రమే. అయితే దేశంలోనే మొట్ట మొదటి సారి నూరుశాతం సక్సస్ రేట్‌తో పుట్టపర్తిలోని 60కి పైగా కృష్ణజింకలు, పొడదుప్పులను బైర్లూటీ డిస్పెన్సరీ వైద్యుల పర్యవేక్షణలో నల్లకాల్వ సెక్షన్‌కు తరలించారు. జింకలు తరలించే సమయంలో అవి తీవ్రమైన భయాందోళనకు గురవుతాయి. అకారణంగా వాటి శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగి అవి షాక్‌కు గురై రవాణాలో ఎక్కువ శాతం మరణిస్తాయి. అయితే బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ జుబేర్, డాక్టర్ అరోన్ వెస్లీల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రవాణా వాహనంలో చల్లటి నీటిని వెదజల్లే స్ప్రింక్లర్‌లు ఉంచడం, కుదుపుల్లో వాహనం అంచులకు తగిలి గాయపడకుండా కుషన్ ఏర్పాటు చేయడం, నల్లమలలో ఒక ఎన్‌క్లోజర్‌లో 10 రోజులు ఉంచి, ఈ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వాటిని అడవిలో వదిలారు.
నల్లమలలో వన్యప్రాణులకో ఆసుపత్రి
ఎన్‌ఎస్‌టీఆర్‌లో విస్తృత
సేవలందిస్తున్న ౖబైర్లూటీ
వెల్డ్ లైఫ్ డిస్పెన్సరీ
గాయపడిన వన్యప్రాణులకు
సత్వర చికిత్స
జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రిక
జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రిక
జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రిక


