మినీ బస్సుకు రూ.86 వేల జరిమానా
కృష్ణగిరి: అమకతాడు టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం 10 గంటల సమయంలో డోన్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్(ఎంవీఐ) క్రాంతికుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక మినీ బస్సును ఆపే ప్రయత్నం చేయగా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. నిర్ఘాంతపోయిన అధికారి తేరుకుని మినీ బస్సును తన వాహనంలో వెంబడించి పట్టుకున్నారు. శ్రీసాయి విష్ణు ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు హైదరాబాద్ నుంచి యాగంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బస్సుకు ఫిట్నెస్ పత్రాలు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్యాక్స్ చెల్లించకపోవడం, చివరకు బస్సు డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు గుర్తించి బస్సును జప్తు చేశారు. రూ.86వేల జరిమానా విధించి, బస్సును ఆర్టీసీ డిపోకు తరలించినట్లు ఎంవీఐ తెలిపారు.


