ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ
ఆదోని అర్బన్: ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేశాడని, ఆ బాలిక తల్లిదండ్రులు శనివారం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు వారిని చూసి.. మాటామాటా పెరిగి.. పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది.
ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్
బండి ఆత్మకూరు: వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు వేటగాళ్లను శనివారం అరెస్ట్ చేసినట్లు బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్ ఝా తెలిపారు. మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన కల్లూరి వెంకట రమణ, కల్లూరి వెంకటేశ్వర్లు, కలడి ఈశ్వరయ్య సెప్టెంబర్ నెలలో గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ వద్ద అడవి పందిని వేటాడుతుండగా అటవీ శాఖ సిబ్బంది వారిని వెంటబడించారు. అప్ప టి నుంచి పరారీలో ఉన్న ముగ్గురిని శనివారం గ్రామ ంలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు అటవీ అధికారి తెలిపారు. సమావేశంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీ సర్లు జి. రామకృష్ణ, వై. నాగేంద్రయ్య, బీట్ ఆఫీసర్ పరమేశ్వరి పాల్గొన్నారు.


