జిల్లా పరిషత్‌లో కంట్రోల్ రూమ్
● మూడు షిఫ్టుల్లో ఆరుగురు ఉద్యోగుల విధి నిర్వహణ
కర్నూలు(అర్బన్): మోంథా తుపాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంట్రోల్ రూమ్‌లో ఈ నెల 31వ తేది వరకు 24 గంటలు సేవలు అందించేందుకు ఆరుగురు ఉద్యోగులు మూడు షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 9885050659, 9603944141, 8247569269, 9494734090, 9014581332, 9848498816 నెంబర్లను సంప్రదించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీసీఏ నిబంధల మేరకు చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కంట్రోల్ రూమ్‌కు డిప్యూటీ ఎంపీడీఓ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఎంపిక చేసిన సచివాలయ ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తారన్నారు.


