
చికిత్స పొందుతూ కోలుకోలేక మహిళ మృతి
ఎమ్మిగనూరురూరల్: ఆత్మహత్యాయ త్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి చెందింది. ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనుంజయ్‌గౌడ్, శశికళ(30) ప్రేమించుకున్నారు. వీరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా ఇద్దరు కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లు కలసి ఉండగా ఈ నెల 6వ తేదీన శశికళ వేధిస్తుందని ధనుంజయ్‌గౌడ్ పురుగు మందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. మరసటి రోజే శశికళ పురుగు మందు తాగడంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం రాత్రి మృతి చెందింది. క్షణికావేశంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.