కర్నూలు(అగ్రికల్చర్): పత్తికొనుగోలు కేంద్రాలు ఈ నెల 21 నుంచి అందుబాటులోకి రానున్నట్లు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు తెలిపారు. సోమవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఏడీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 12 జిన్నింగ్ మిల్లులు, నంద్యాల జిల్లాలో మూడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందన్నారు. మద్దతు ధర రూ.8,110 కాగా.. పత్తిలో తేమ ఎనిమిది శాతం వరకు ఉంటే పూర్తి ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోలులో ఎలాంటి పరిమితులు ఉండవని, మార్చి నెల చివరి వరకు కొనుగోళ్లు చేస్తామన్నారు. సమావేశంలో ఏడీఎం నారాయణమూర్తి పాల్గొన్నారు.
విధుల్లో చేరిన జిల్లా
అటవీ శాఖాఽధికారి శ్యామల
కర్నూలు కల్చరల్: జిల్లా అటవీ శాఖాధికారిగా ఐఎస్‌ఎఫ్ శ్యామల సోమవారం తిరిగి విధుల్లో చేరారు. డెహ్రాడూన్‌లో రెండు నెలల పాటు జరిగిన వృత్యంత శిక్షణకు హాజరైన ఆమె తిరిగి డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు సర్కిల్ నూతన సీఎఫ్ బీవీఏ కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను వివరించారు. దేశ శ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 67 మంది డీఎఫ్‌వోలు శిక్షణలో పాల్గొన్నారన్నారు. శిక్షణలో తెలుసుకున్న, నేర్చుకున్న అంశాలు జిల్లా అటవీ శాఖ సంరక్షణలో ఉపయోగపడతాయని తెలిపారు.
డీటీడబ్ల్యూఓగా సురేష్ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అర్బన్): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా డి.సురేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న జరిగిన డీపీసీలో అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న సురేష్‌కు డీటీడబ్ల్యూఓగా పదోన్నతి కల్పించి కర్నూలుకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ డీటీడబ్ల్యూఓగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌కు కార్యాలయ పర్యవేక్షకులు మునిచంద్ర, సిబ్బంది, వసతి గృహ సంక్షేమాధికారులు పూలబోకేను అందించి అభినందనలు తెలిపారు.
నేడు మద్యం షాపులపై తాజా సర్వే
కర్నూలు(అర్బన్): గ్రామాలు, పట్టణాల్లో ఉన్న మద్యం షాపులు, బార్లపై తాజాగా నేడు సర్వే నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ఈ సర్వేను చేపట్టాల్సి ఉంటుంది. ఆయా సచివాలయాల పరిధిలోని మద్యం షాపులు, బార్లకు సంబంధించి భౌగోళిక అక్షాంశాలను తమ జీఎస్‌డబ్ల్యూఎస్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వేలో ఆయా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు మినహాయింపు ఇచ్చారు. వారి స్థానంలో ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని ఎంపీడీఓలు, కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రానికి సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.
21 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు
21 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు