
సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నందికొట్కూరు: సారా తయారీ చేసినా, విక్రయించినా చట్ట పరమైన చర్యలు తప్పవని కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఎకై ్స జ్ సూపరిటెండెంట్ రాజశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని నీలిషికారిపేటలో రాజశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ పోలీసులు సారా స్థావరాలపై దాడి చేసి 220 లీటర్ల బెల్లం ఊటను, 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. పట్టణంలో సారా తయారీ స్థావరాలపై దాడులు చేయడంతో పాటు కల్లు దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సారా రవాణా చేస్తే క్రిమినల్ కేసులతో పాటు వాహనాలు సీజ్ చేసి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. దాడుల్లో కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ మారుతి ప్రసాద్,పట్టణ ఎకై ్స జ్‌శాఖ ఎస్‌ఐ జప్రూల్లా, హెడ్ కానిస్టేబుల్ కృపవర కుమారి, పద్మనాభం, రామాంజనేయులు, పోలీసులు మధుసూదన్, ప్రసాద్, శ్వేతారాణి, రమిజాబీ, అల్లాస్వామి, జయచంద్రుడు, మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.