
రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?
కర్నూలు (టౌన్): పంటలు పండక, పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు బాసటగా ఈనెల 9వ తేదీ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరుపేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామని, అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లోశనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు.
జగనన్న హయాంలో రైతులు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చారా?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా రైతులు రోడ్ల మీదకు వచ్చారా అని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ధరల స్థికరణకు రూ. 3 వేల కోట్ల నిధి ఉంచారని, కోవిడ్ సమయంలోను చీనీ, పత్తి రైతులను ఆదుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి... క్యాలెండర్ ప్రకారం ఐదేళ్లు రైతు సంక్షేమాన్ని అమలు చేశారన్నారు. రైతులను ఆదుకోవడం చేత కాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటుఽ ధరలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మామిడి, చీనీ, ఉల్లి, పత్తి, టమాటా, మిర్చి, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు, యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్ హనుమంత రెడ్డి, కిషన్ కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, రాజేశ్వరరెడ్డి, షాషావలీ పాల్గొన్నారు.
రూ. కోట్ల దోపిడీ?
రాష్ట్రానికి 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే ఎక్కడికి పోయిందని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మార్కెఫెడ్‌లకు, 50 శాతం ప్రెవేటు డీలర్లకు యూరియా అందించాల్సి ఉందన్నారు. యూరియా మొత్తం ప్రైవేటు డీలర్లకు అందించి టీడీపీ నేతలు రూ. కోట్లు దొపిడీ చేశారన్నారు. యూరియా బస్తా ధర రూ. 270 నుంచి రూ. 450కు పెంచి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
యూరియా అందించని దీన స్థితితో
ఉన్నారా?
రైతులకు బాసటగా
9న అన్నదాత పోరు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి