రైతుకు వి‘పత్తి’ | - | Sakshi
Sakshi News home page

రైతుకు వి‘పత్తి’

Sep 7 2025 7:52 AM | Updated on Sep 7 2025 7:52 AM

రైతుక

రైతుకు వి‘పత్తి’

● వైరస్‌ సోకి ఎండిపోతున్న పత్తి పొలాలు ● లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట ● పూర్తిగా తగ్గనున్న దిగుబడి ● పెట్టుబడులు కూడా రాని దుస్థితి అధిక తేమతోనే వైరస్‌ ప్రభుత్వం ఆదుకోవాలి పెట్టుబడులు కూడా రావు

● వైరస్‌ సోకి ఎండిపోతున్న పత్తి పొలాలు ● లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట ● పూర్తిగా తగ్గనున్న దిగుబడి ● పెట్టుబడులు కూడా రాని దుస్థితి

కృష్ణగిరి: కొన్ని రోజులు వర్షాలు లేకపోవడం.. ఉన్నట్టుండి వానలు భారీగా పడటంతో పత్తి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరస్‌ సోకి ఎర్రగా మారాయి. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినింది. దిగుబడిి పూర్తిగా తగ్గి పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా.. అత్యధికంగా 2,19,636 హెక్టార్లలో పత్తి సాగైంది.

పంటంతా ఎర్రగా మారి..

గతేడాది వేరుశనగ సాగు చేయగా దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చాయి. దీంతో ఈ యేడాది రైతులు అధికంగా పత్తి వైపు మొగ్గు చూపారు. మే నెల చివరల్లో కురిసిన వర్షాలకు చాలా మంది విత్తనం వేశారు. అలాగే జూన్‌ నెలలో కూడా లక్షల ఎకారాల్లో పత్తి సాగు చేశారు. ఆశించిన మేర వర్షాలు పడటంతో పంట ఏపుగా వచ్చి కాయలు వచ్చాయి. అయితే జూలై నెలంతా బెట్ట రావడంతో పంట ఎండుపోయే దుస్థితికి వచ్చింది. ఈ సమయంలో ఆగస్టు నెలలో ఒక్కసారిగా భారీ వర్షాలు రావడంతో ఏపుగా వచ్చినట్లు వచ్చిన పత్తి పంటకు వైరస్‌ సోకింది. పంటంతా కళ్లేదుటే ఎర్రగా మారింది.

పెట్టుబడి మట్టిపాలు

ఇంటికి తెల్లబంగారం(పత్తి) వస్తుందని ఆశించిన రైతులకు కన్నీరే మిగిలింది. అధిక వర్షాలతో జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతినడంతో కోట్ల రూపాయల పెట్టుబడి మట్టిపాలైంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు తదితర వాటి కింద ఎకరాకు రూ. 40వేల వరకు ఖర్చు చేశారు. ఎర్ర, నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంట కాయ దశకు వచ్చే సమయానికి వైరస్‌ సోకింది. పంట ఎర్రగా మారి ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా అందని స్థితిలో ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కూడా ఇదే తెగులు రావడంతో కనీస దిగుబడి కూడా అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి అదుకోవాలని కోరుతున్నారు.

వరుసగా 15రోజులు వర్షాలు వచ్చి అధిక తేమ పొలంలో ఉండటంతో పత్తిని వైరస్‌ అశించింది. ఇది బాక్టీరియల్‌ బ్‌లైట్‌. దీనిని కోణీయ ఆకు మచ్చ తెగులు అని కూడా పిలుస్తారు. వైరస్‌ సోకిన పత్తి చెట్ల అవశేషాలను నాశనం చేస్తే దీన్ని నివారించవచ్చు. ఆమ్ల–డిలింట్‌ చేసిన విత్తనాలు వాడి, సరైన నీటిపారుదల పద్ధతులు నిర్వహిస్తే ఈ వైరస్‌ రాదు.

– మహేంద్ర, ఏఓ, కృష్ణగిరి

గతేడాది పొగాకు సాగు చేశాం. మంచి దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక చాలా నష్టపోయా. ఈ ఏడాది నాకున్న ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగుచేశా. కాయదశకు వచ్చే సరికి వర్షాలు అధికంగా రావడంతో తేమ అధికమై పంటకు వైరస్‌ సోకి ఎర్రగా మారింది. ఎకరాకు రూ. 40వేల ప్రకారం రూ.3 లక్షల పెట్టుబడులు పెట్టా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి. –బజారి, పత్తి రైతు, ఎస్‌హెచ్‌ ఎర్రగుడి

నాకున్న 15 ఎకరాల్లో పత్తి సాగుచేశా. పంట వస్తే అప్పులు కట్టుకోవచ్చని ఆశ పడ్డాను. భారీ వర్షాలతో 8 ఎకరాల పొలానికి వైరస్‌ వచ్చి పంట ఎర్రగా మారడం ప్రారంభించింది. దీని నివారణకు మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. చెట్టుకు ఉన్న నాలుగైదు కాయలు మాత్రమే చేతికి వచ్చేలా కనపడుతోంది. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. పత్తి రైతును ప్రభు త్వం ఆదుకోవాలి. –నాగేశ్వరరావు, పత్తి రైతు, రామకృష్ణాపురం

రైతుకు వి‘పత్తి’ 1
1/4

రైతుకు వి‘పత్తి’

రైతుకు వి‘పత్తి’ 2
2/4

రైతుకు వి‘పత్తి’

రైతుకు వి‘పత్తి’ 3
3/4

రైతుకు వి‘పత్తి’

రైతుకు వి‘పత్తి’ 4
4/4

రైతుకు వి‘పత్తి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement