
వామ్మో.. జ్వరాలు!
రోగులు కిక్కిరిసిన
ఆలూరు ఆసుపత్రి
వారం రోజుల నుంచి జ్వర పీడితులు పెరుగుతున్నారు. వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల బాటపడుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లోనే వెయ్యి మందికి పైగా ఓపీ నమోదైనట్లు ఆలూరు సీహెచ్‌సీ వైద్యులు వెల్లడించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగల సంఖ్య మాత్రమే. ఆయా గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన రోగుల సంఖ్య ఎక్కవగా ఉంది. సోమవారం నుంచి బుధవారం వరకు రోజు 450 మందికి పైగా రోగులు ఆసుపత్రికి వచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా 200 మందికి దాకా రోగులు ఓపీకి వచ్చారు. ఆరుగురు వైద్యుల్లో ముగ్గురు సెలవుపై వెళ్లారు. ఉన్న ముగ్గురులో ఒకరు చిన్న పిల్లల వైద్యులు, ఒకరు జనరల్ మెడిసిన్, ఇంకో వైద్యురాలు గైనకాలజిస్టు మాత్రమే విధుల్లో ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఓపీలో కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేక ఉన్న ఇద్దరు డాక్టర్ల వద్ద వైద్యం కోసం వేచి ఉండలేక ఇబ్బంది పడ్డారు.
– ఆలూరు రూరల్
రోగులతో కిక్కిరుస్తున్న
ప్రభుత్వ ఆసుపత్రులు
నాలుగు రోజుల్లో వెయ్యికి పైగా
కేసులు నమోదు

వామ్మో.. జ్వరాలు!