
లాటరీ ద్వారా 19 బార్లు కేటాయింపు
ఏడు బార్లకు ముందుకు రాని ఆశావహులు
కర్నూలు: ఒక్కొక్క బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు తగ్గకుండా వచ్చిన వాటికి మాత్రమే లాటరీ తీసి ఎకై ్సజ్ అధికారులు లైసెన్స్‌దారులను ఎంపిక చేశారు. నూతన మద్యం పాలసీ పేరుతో జిల్లాలో బార్ల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎకై ్సజ్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో 7 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మొత్తం 26 బార్ల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో నాలుగేసి దరఖాస్తులు 16 బార్లకు వచ్చాయి. గీత కులాలకు రిజర్వు చేసిన మూడు బార్లకు 19 దరఖాస్తులు వచ్చాయి. ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి పర్యవేక్షణలో శనివారం జిల్లాపరిషత్ సమావేశ భవనంలో మద్యం బార్ల అనుమతులకు లక్కీడిప్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య లాటరీ తీసి బార్లను కేటాయించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ కేవలం గంటన్నర వ్యవధిలోనే ముగిసింది. కర్నూలులో 4, ఎమ్మిగనూరులో 2, గూడూరులో ఒక బార్ ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 19 బార్లకు 83 దరఖాస్తులు రాగా వాటికి మాత్రమే లక్కీ డిప్ నిర్వహించారు. దరఖాస్తుల ద్వారా రూ.4.15 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. పెండింగ్ బార్లకు రీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు.
గీత కులాలకు మూడు బార్లు
పది శాతం రిజర్వేషన్ కింద గీత కులాలకు కర్నూలులో రెండు, ఆదోనిలో ఒకటి చొప్పున మొత్తం మూడు బార్లు అదనంగా ప్రభుత్వం కేటాయించింది. వీటికి మొత్తం 19 దరఖాస్తులు వచ్చాయి. వాటికి కూడా లాటరీ తీసి విజేతలను ప్రకటించారు. అలాగే కర్నూలులో ఆస్పరి రజిత, ఆదోనిలో ఎల్లాల లలితమ్మ లక్కీడిప్‌లో బార్లను దక్కించుకున్నారు. లైసెన్స్ దక్కించుకున్న వారు నిర్దేశిత ఫీజులో ఒక వాయిదా నగదు చెల్లించి ఎకై ్సజ్ అధికారుల చేతుల మీదుగా ప్రొవిజినల్ పత్రాలు పొందారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జాన్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బార్లకు రీ నోటిఫికేషన్
రేపటి నుంచి అందుబాటులోకి
కొత్త బార్లు