
తల్లీకుమారుడు అదృశ్యం
కోసిగి: జంపాపురం గ్రామానికి చెందిన కాపు పురుషోత్తం రెడ్డి భార్య ఉమాదేవి తన రెండున్న ర ఏళ్ల కుమారుడు య శ్వంత్ రెడ్డి రెండు రోజు లుగా కనిపించడం లేదు. ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె ఉదయం 11 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ చైన్నె మెయిల్ ఎక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. బంధువులు పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేక పోయింది. దీంతో కుటుంబీకులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు సీఐ మంజునాథ్, ఎస్‌ఐ హనుమంత రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9121101154, 9121101155కు సమాచారం ఇవ్వాలన్నారు.
సెల్‌ఫోన్ కొనివ్వలేదని..
● విద్యార్థి ఆత్మహత్య
దేవనకొండ: సెల్ ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంజీవుడు, రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్న కుమారుడు శ్రీనాథ్‌గౌడ్(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. అయితే ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను పదేపదే అడిగాడు. తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, ఉన్నప్పుడు కొనిస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనాథ్‌గౌడ్ గత నెల 9వ తేదీన పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల రోజు లుగా చికిత్స పొందుతూ కోలుకోలేక చివరకు ఈనెల 10వ తేదీన మృతిచెందినట్లు దేవనకొండ పోలీసులు శుక్రవారం తెలిపారు.
భార్యను కాపురానికిపంపలేదని..
కోసిగి: ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన దేవమ్మ, ఏకాంబరం దంపతుల కుమారుడు బళ్లారప్ప అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కోసిగి మండలం మూగలదొడ్డి గ్రామానికి చెందిన వీరేశమ్మతో వివాహమైంది. ఇటీవల గ్రామంలో జరిగిన మొహర్రం పండుగ కోసం భార్య పుట్టింటికి వెళ్లింది. గురువారం గ్రామానికి వచ్చిన బళ్లారప్ప.. భార్యను తనతో పంపాలని కోరగా.. గురుపౌర్ణమి ఉండటంతో రెండు రోజుల ఆగి పంపిస్తామని భార్య కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం మూగలదొడ్డి గ్రామంలో పొలాల వైపు వెళ్లి పురుగు మందు తాగి ఆపస్మార స్థితిలో పడి పోయాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

తల్లీకుమారుడు అదృశ్యం