
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
నందికొట్కూరు: మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు – దామగట్ల గ్రామాల మధ్య కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపిన వివరాలు.. దామగట్ల గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులు సోమవారం సాయంత్రం సరదాగా గడిపేందుకు ఏపీ 21 సీజే 6804 నంబరు గల కారులో బ్రాహ్మణకొట్కూరుకు వచ్చారు. అక్కడినుంచి రాత్రి దామగట్ల గ్రామానికి వెళుతుండగా మార్గం మధ్యలో కారు అదుపుతప్పి కారు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఫరూక్ (34), రాజశేఖర్ (33) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కిషోర్‌కు గాయాలు కాగా మిగతావారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారి గురించి తెలియలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిషోర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు చె ప్పారు. మృతుడు ఫరూక్‌కు భార్య, ముగ్గురు పి ల్లలు ఉన్నారు. రాజశేఖర్‌కు వివాహం కాలేదు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం