ముందస్తు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి
మద్దికెర: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ముందస్తు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఆయన సందర్శించి అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. జీవన వ్యవహార శైలిలో వచ్చిన మార్పులతో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. రక్తపోటు, షుగర్, క్యాన్సర్‌తో పాటు ఇతర వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. వ్యాయామం లేకుండా ఒకే చోట ఉంచి పనులు చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలన్నారు. పచ్చళ్లు, నిల్వ వుంచిన పదార్థాలను పూర్తిగా తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి రాగిణి, సీహెచ్‌ఓ నిరంజన్ బాబు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్‌బాషా, ఆరోగ్య పర్యవేక్షకులు సూర్యనారాయణ పాల్గొన్నారు.


