
వక్ఫ్‌ను రక్షించుకుందాం
మానహారంలో నిర్వహిస్తున్న ముస్లింలు,
చిత్రంలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
కర్నూలు (టౌన్): ‘వక్ఫ్‌ను రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు హఫీజ్‌ఖాన్ పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక పాతబస్తీలోని కుబ్ సూరత్ మసీదు వద్ద ముస్లింలు మౌన మానవహారం నిర్వహించారు. వక్ఫ్‌ను రక్షించాలని నినాదాలు చేశారు. మౌన మానవహారానికి భారీగా మహిళలు, పురుషులు, పిల్లలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను ఈ చట్టం కాలరాస్తుందని, అందుకే ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ముస్లింల మనోభావాలకు దెబ్బతినకుండా సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజలు శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగించాలన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా జకీర్ , జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కర్నూలులో ముస్లింల మౌన
మానవహారం

వక్ఫ్‌ను రక్షించుకుందాం