
ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్‌ల విడుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం గత ఏడాది జనవరి 29న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి మెడికల్ ఫిజిసిస్ట్, అనెస్తీషియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ కేటగిరిల అభ్యర్థుల ఫైనల్ మెరిల్ లిస్ట్‌లు, సెలక్షన్ లిస్ట్‌లను కర్నూలు, నంద్యాల జిల్లాలు, కర్నూలు మెడికల్ కాలేజీల ప్రభుత్వ వెబ్‌సైట్‌లు https://kurnool.ap.gov.in, https://nandyal .ap.gov.in,https://kurnoolmedicalcollege.ac.inలలో ఉంచినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్ కాలేజీలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.
ఈశ్రమ్ కార్డులు పొందండి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి
కర్నూలు(సెంట్రల్): అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరూ ఈ శ్రమ కార్డులను పొందేలా పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాల్లో భాగంగా పారా లీగల్ వలంటీర్లకు కార్మికులు ఈశ్రమ కార్డును పొందేలా అవగాహన కల్పించడం కోసం సదస్సును ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శ్రమ కార్డు ను పొందిన కార్మికులకు ఉచితంగా రూ.2లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్పులు, వారి పెళ్లిళ్లకు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు, పారా లీగల్ వలంటీర్లకు అవగాహన కల్పించారు.
నేటి నుంచి హ్యాండ్‌బాల్ పోటీలు
కర్నూలు (టౌన్): ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సుజాత ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈనెల 3,4 తేదీల్లో 54వ రాష్ట్రస్థాయి మహిళా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్‌బాల్ సంఘం నిర్వహణ కార్యదర్శి గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనచరచిన క్రీడాకారులను ఆంఽధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తారని వెల్లడించారు.