
ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేర
ప్రయాణికులతో కిక్కిరిసిన కర్నూలు బస్టాండ్
జిల్లాల వారీగా
తరలించిన
బస్సుల సంఖ్య
కర్నూలు నంద్యాల
105 115
రెండు గంటలైనా
ఒక్క బస్సు రాలేదు
మా బంధువు కర్నూలు పెద్దాసుపత్రిలో ఉంటే పరామర్శించేందుకు వచ్చాం. తిరిగి ఆదోని వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చి రెండు గంటలైనా ఒక్క బస్సు కూడా లేదు. ఊరికెట్లా పోవాలో తెలియడం లేదు. ఎంతో మంది బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు బస్సులన్నీ వేరే ఊళ్లకు పంపితే మాలాంటోళ్ల పరిస్థితి ఎట్లా. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు హామీని వెంటనే నెరవేర్చాలి.
– వెంకటలక్ష్మి, ఆదోని
బస్సు లేక ఇబ్బంది పడ్డాం
పెళ్లి నిమిత్తం కుటుంబం అంతా కలిసి నంద్యాలకు వచ్చాం. కార్యక్రమం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండక్‌కు చేరుకున్నాం. అప్పటి నుంచి 3 గంటలుగా బస్సు కోసం వేచి చూస్తూనే ఉన్నాం. ఎంకై ్వరీలో అడిగితే ఎక్స్‌ప్రెస్ బస్సులు అమరావతికి తరలించడంతో బస్సులు తక్కువగా ఉన్నాయని, బస్సు వచ్చేంత వరకు వేచి ఉండాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
– మహేశ్వరరెడ్డి, కడప
ప్రయాణికులను
ఇబ్బంది పెట్టడం సరికాదు
రాజధాని పేరుతో ఆర్టీసీ బస్సులన్నీ గుంటూరు, విజయవాడ జిల్లాకు తరలించి ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వానికి తగదు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులదే. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బస్సులను ఇతర ప్రాంతాలకు పంపితే పేదలు ఎలా ప్రయాణం చేయాలి.
– ఎం.శంకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి, నంద్యాల
కర్నూలు సిటీ: రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతికి వస్తుండడంతో కూటమి ప్రభుత్వం భారీగా జనసమీకరణకు సిద్ధమైంది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు చెందిన మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్టీసీలో బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి దాదాపు 220 బస్సులను ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో వివిధ పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. బస్టాండ్లలో బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు, వైద్య చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు వచ్చి తిరుగు ప్రయాణమయిన వారు.. వృద్ధులు బస్టాండ్లలో ఉక్కపోతకు విలవిలలాడారు. కొంత మంది తప్పని పరిస్థితుల్లో అధిక చార్జీలు పెట్టి ప్రైవేటు వాహనాల్లో సొంతూర్లకు చేరుకున్నారు. పీఎం సభకు తరలించిన బస్సులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. అరకొరగా ఉన్న బస్సుల్లో వెళ్లేందుకు పోటీ పడ్డారు. సీటు లేకపోయినా అతి కష్టం మీద నిల్చుని ప్రయాణించాల్సి వచ్చింది.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
బస్సు సర్వీసుల రద్దుతో బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. ఈ క్రమంలో పలు రూట్లలో బస్సు సర్వీసులు లేకపోవడంతో గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఎండ వేడమితో ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో విలవిలాడారు. బస్టాండ్లలో సౌకర్యాలు సైతం లేకపోవడంతో అవస్థలు పడ్డారు.
మరో రెండు రోజులూ ఇవే కష్టాలు
ఏపీ రాజధాని అమరావతి అంటూ.. 2015 జూన్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతల మీదుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాలతో సరిపెట్టింది. మరోసారి రాజధాని పనుల పునఃనిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు పీఎం మోడీ శుక్రవారం అమరావతి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను తరలించేందుకు కర్నూలు జిల్లా నుంచి 105, నంద్యాల జిల్లా నుంచి 115 బస్సులను వివిధ ప్రాంతాలకు మళ్లీంచారు. గత ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులను ప్రజల ప్రయాణానికి మాత్రమే వినియోగించాలి.. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పార్టీ సమావేశాలు కాదని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడే అదే కూటమి నేతలు పీఎం సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని చోట్ల ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సుల్లోనూ జనాలను తరలిస్తున్నారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సూదూర ప్రాంతాలకు బస్సులను తరలించడంతో ఆ బస్సులు తిరిగి శనివారం ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో వివిధ రూట్లలో రద్దు చేసిన బస్సు సర్వీసులను శనివారం సాయంత్రం తర్వాతనే ఆర్టీసీ అధికారులు పునఃరుద్ధరించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలతో ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి
220 బస్సులు మోదీ సభకు తరలింపు
పలు రహదారుల్లో
బస్సు సర్వీసులు రద్దు
అవస్థలు పడిన ప్రయాణికులు
గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షణ
ప్రైవేటు వాహనాల్లో
గమ్యస్థానాలకు చేరిన వైనం
కూటమి ప్రభుత్వంపై
ప్రయాణికుల ఆగ్రహం

ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేర

ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేర

ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేర

ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేర

ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేర