
కరువు రైతుకు ఉపశమనం
నియోజక వర్గాల వారీగా
ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల వివరాలు
నియోజక వర్గం లబ్ధిపొందే ఇన్‌పుట్
రైతులు సబ్సిడీ
(రూ.కోట్లలో)
కోడుమూరు 42,210 41.53
పాణ్యం 22,476 22.47
(కల్లూరు, పాణ్యం)
మంత్రాలయం 64,523 82.56
ఆదోని 29,864 39.99
ఆలూరు 74,868 113.15
పత్తికొండ 64,314 70.62
ఎమ్మిగనూరు 49,478 63.08
కర్నూలు 373 0.30
మొత్తం 3,48,106 433.70
నంద్యాల జిల్లాలో..
బేతంచెర్ల 11,999 11.12
బనగానపల్లి 4,888 4.89
గడివేముల 1,030 1.08
మిడుతూరు 5,605 6.10
పగిడ్యాల 3,264 3.23
పాణ్యం 352 0.42
మొత్తం 27,138 26.87
● పూర్తయిన ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల
● ఉమ్మడి జిల్లాకు రూ.460.47 కోట్ల
ప్రయోజనం
కర్నూలు(అగ్రికల్చర్): కరువు రైతుకు ఉపశమనం లభించింది. ఇన్‌పుట్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు రూ.460.47 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చింది. అనావృష్టి పరిస్థితులతో ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో కర్నూలు రూరల్, తుగ్గలి మండలాలు మినహా మిగిలిన 24 మండలాలు, నంద్యాల జిల్లాలో 6 మండలాలను.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 30 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. మార్చి నెలలోనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ వివిధకారణాల వల్ల నిధులు విడుదల కాలేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ అనుమతితో రైతుల బ్యాంకు ఖాతాలకు నిధుల విడుదల రంగం సిద్ధం చేసినప్పటికీ టీడీపీ కూటమి అడ్డుకుంది. ఎన్నికల ముగిసిన తర్వాత ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3,75,244 మంది రైతులకు ప్రయోజనం
కర్నూలు జిల్లాలో వ్యవసాయ పంటలు 2,38,230.92 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మొత్తం 2,90,741 మంది పంటలను నష్టపోయారు. వీరికి రూ. 371.05 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలైంది. ఉద్యాన పంటలకు సంబంధించి 36,855.25 హెక్టార్లలో టమాట, ఉల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి దెబ్బతిన్నాయి. మొత్తం 57,365 మంది రైతులకు రూ.62.65 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలైంది. కర్నూలు జిల్లాలో 3,48,106 మంది రైతులకు రూ.433.70 కోట్ల మేర ఉపశమనం కలిగింది. నంద్యాల జిల్లాలో కరువు ప్రాంతాలుగా గుర్తించిన ఆరు మండలాల్లో 22,812 హెక్టార్లలో 27,138 మంది రైతులు పంటలను 33 శాతం ఆపైన నష్టపోగా... ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.26.87 కోట్లు విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 3,75,244 మంది రైతులకు రూ.460.47 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ లభించింది.