
కుంగిన ప్రదేశాన్ని పరిశీలించి ఇంజినీర్లతో మాట్లాడుతున్న సీఈ కబీర్‌బాషా
పాణ్యం: గోరుకల్లు జలాశయం ఓటీ రెగ్యులేటర్ వద్ద కుంగిన బండ్‌ను సోమవారం జలవనరుల శాఖ సీఈ కబీర్‌బాషా పరిశీలించారు. బండ్ కుంగడానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఇంకోసారి బండ్ కుంగకుండా తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం పనులు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఇదిలా ఉండగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఈ విషయంపై ఫోన్‌లో జలవనరుల శాఖ మంత్రి, ఈఎన్‌సీతో మాట్లాడారు. మరమ్మతులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఈ వెంట ఈఈ సుభకుమార్, డీఈఈ ఆశ్వర్థనారాయణ, ఏఈఈలు ఉన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం
● వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న
విద్యుత్ అధికారులు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై సోమవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు విద్యుత్ అధికారులు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం నుంచి విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు సంతోష్‌రావు, పృద్వీతేజ్ తాము ప్రతిపాదించిన వాటి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మొదటి రోజు అభిప్రాయాలు వెల్లడించేందుకు, విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన వాటిపై అభ్యంతరాలు చెప్పేందుకు పారిశ్రామికవేత్తలు, ఇతరులు ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మంగళ, బుధవారాల్లో కూడా వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. సోమవారం కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ కేంద్రాలుగా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కర్నూలులో జరిగిన వీడియో కాన్పరెన్స్‌లో ఎస్‌ఈ ఉమాపతి, కర్నూలు టౌన్ డీఈ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
నేడు సీ క్యాంపు
రైతుబజారు బంద్
కర్నూలు(అగ్రికల్చర్): పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ నెల 30న నగరంలోని సీ.క్యాంపు రైతుబజారును ఒక్కరోజు బంద్ చేస్తున్నట్లుగా ఎస్టేటు అధికారి హరిష్‌కుమార్, హార్టీకల్చర్ కన్సల్టెంటు శివకుమార్ తెలిపారు. వినియోగదారులు, రైతుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని రైతుబ జారును శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి రైతుబజారు యథావిధిగా పనిచేస్తుందని వారు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎం.ఉమాపతి