
ఒకప్పుడు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్.. ఏడు గంటలు అన్నారు కానీ.. రైతులకు ‘ఏడు’ పే మిగిలేది.. ఎండుతున్న పంటలను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉండేది. కొత్త కనెక్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లభించేది కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తొలగాయి. నిరంతరంగా తొమ్మిది గంటల విద్యుత్ పగటి పూటే అందుతోంది. ఎక్కడా కోత పెట్టకుండా సీనియారిటీ ప్రకారం ఉచిత విద్యుత్ కనెక్షన్లు విరివిగా మంజూరు చేస్తున్నారు. మోటారు కాలిపోకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2019 నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు విడుదల చేసిన
ఉచిత విద్యుత్ కనెక్షన్లు
సంవత్సరం విడుదలైన కనెక్షన్లు
2019 11,693
2020 13,074
2021 8,027
2022 18,360
2023 6,724
మొత్తం 57,878
