
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి
బొమ్మలసత్రం: కర్నూలు పట్టణానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.1.50 లక్షలు తీసుకుని ఉద్యోగము ఇప్పించకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నంద్యాలకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి స్పందనలో జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఫిర్యాది చేశాడు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే స్పందనలో ఒకసారి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల నుంచిి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తంగా 90 ఫిర్యాదులు అందాయని వాటిని చట్ట పరిదిలో పరిష్కరిస్త్మాన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సంతోష్, నంద్యాల తాలూక సీఐ దస్తగిరి బాబు, సీఐ సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు.