
కర్నూలు (న్యూటౌన్): కర్నూలు మండలం గార్గేయపురం డంప్‌యార్డుకు వెళ్లే దారిలో వజ్రాలు లభిస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. నెల రోజుల క్రితం గార్గేయపురానికి చెందిన వ్యక్తికి రూ.30లక్షల విలువ వజ్రం దొరికిందనే ప్రచారం విస్తృతంగా సాగడంతో ఆశాజీవులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. సమీపా పల్లెతోపాటు ఇతర మండలాలకు చెందిన ప్రజలు సైతం వజ్రాన్వేషణకు వస్తున్నారు.
బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, శ్రీశైలం, నన్నూరు, ఓర్వకల్లు గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు వజ్రాన్వేషణలో నిమగ్నమయ్యారు.